మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. నాసిక్‌లో 1.5 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిం చారు. రోడ్‌షోలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఇతర నేతలు పాల్గొన్నారు. రామ్‌ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేయనున్న ప్రధాని.. చారిత్రక కాలారామ్ ఆలయంలో పూజలు చేస్తారు. దేశంలోనే పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రారంభించానున్నారు మోదీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి అందించిన సేవలను గుర్తుగా ఈ బ్రిడ్జీకి అటల్ సేతు అని నామకరణం చేశారు. ఈ అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల పొడువు ఉండే ఈ బ్రిడ్జిపై వాహన దారుల భద్రత కోసం సుమారు 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వంతెనపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. ఈ మార్గం ద్వారా దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. మొత్తం ఆరులైన్లతో ఈ బ్రిడ్జీని ఏర్పాటు చేశారు. 21.8 కిలోమీటర్ల పొడు వు ఉండే ఈ బ్రిడ్జిలొ సముద్రంపై 16.5 కిలోమీటర్లు, నేలపై 5.3 కిలోమీటర్లు ఏర్పాటుచేశారు.2018లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది.సుమారు రూ.18 వేల కోట్లతో అత్యాధునిక హంగులతో అటల్ సేతు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5కి.మీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది.