విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీచర్స్ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాలు 36 గంటల పాటు ధర్నాకు అనుమతి కోరారు. ఇప్పటికే అంగన్ వాడి, మున్సిపల్ కార్మికుల సమ్మెలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీచర్స్ కూడా ఆందోళలు చేపట్టారు.తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘా లు ఛలో విజయవాడకు పిలుపిచ్చాయి. హమీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతీ నెల1న జీతాలు చెల్లించాలని, రూ 18వేల కోట్లు ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి ఆందోళనకు అనుమతి లేదని టీచర్స్‌ను అడ్డుకున్న పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30,144 అమలు చేస్తున్నారు. విజయ వాడ రైల్వే స్టేషన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.