బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పును మార్చింది. బిల్కిస్ బానో కేసులో హంతకులుగా శిక్ష పడిన 11మందికి శిక్ష తగ్గిస్తూ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు ఆదేశాన్ని కొట్టివేసింది. 2002 అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారంతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురి హత్య కేసులో 11 మంది దోషులకు ఉపశమ నం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
దోషులకు శిక్ష తగ్గింపులో గుజరాత్ ప్రభుత్వం వారితో కుమ్మక్కై వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. ఇది విచారణను రాష్ట్రం వెలుపలకు మార్చాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ గుజరాత్ హైకోర్టు మరో ధర్మాసనం 2022 మే 13న ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
బిల్కిస్ బానో కేసులో దోషులు శిక్ష తగ్గింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను నిర్ణయించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాన్నిగుంజుకుందని. . శిక్షతగ్గించాలా లేదా అని నిర్ణయించే అధికారం మహా రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషులను విచారించి శిక్ష విధించే రాష్ట్రానికే దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను నిర్ణయించే అధికారం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంద ని స్పష్టం చేసింది. దోషులకు ఉపశమనం కల్గించే విధంగా శిక్ష తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ రాష్ట్రానికి లేదని, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దోషి పిటిషనర్ తప్పుదోవ పట్టించే ప్రకటన చేయడం ద్వారా 2022లో దోషి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని సుప్రీంకోర్టు పేర్కొంది.