హైదరాబాద్ హబ్సిగూడలో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి చనిపోయిన ఘటనలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాన్సన్ స్కూల్ ఎదుట బైఠాయించారు విద్యార్థి సంఘాల నేతలు. చిన్నారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు మృతి చెందిందని ఆరోపించారు.ఉదయం హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో దారుణం జరిగింది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చిన చిన్నారిని .. తల్లి కిందకు దించింది. అదే సమయంలో డ్రైవర్ బస్సును పోనివ్వడంతో చిన్నారి బస్సు టైర్ల కింద పడి మృతి చెందింది.