కిమ్ జోంగ్-ఉన్ ఏదైనా రెచ్చగొట్టినట్లయితే అమెరికా , దక్షిణ కొరియాలను పూర్తిగా నాశనం చేయాలని సైన్యాన్ని ఆదే శించాడు.అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్వింపు దిగితే ఉపేక్షించ వద్దని సైన్యానికి పిలుపునిచ్చాడు. ఇప్పటి నుండి ద.కొరియాతో ఎటువంటి సయోధ్య ప్రయత్నాలు ఉండబోవని ఖరాఖండిగా చెప్పాడు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా జాతీయ మీడియా వెల్లడించింది.
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంటుందని, యుద్ధానికి కాచుకొని ఉండాలని కిమ్ సైన్యాన్ని ఉద్దేశించి చెప్పారు. 2024లో అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, కిమ్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన మిలటరీ కమాండర్ల సమా వేశంలో మాట్లాడుతూ.. వాస్తవాన్ని గుర్తించండి. దక్షిణ కొరియాతో సంబందాలపై స్పష్టతనివ్వాల్సిన సమయం వచ్చిం దని కమాండర్లతో స్పష్టం చేశారు. ఒక వేళ వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే.. మా వద్ద ఉన్న అణు ఆయుధాలు వాడటానికి వెనుకాడం అని తెగేసి చెప్పాడు. మా దేశాన్ని శత్రుదేశంగా ప్రకటిస్తే…మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నితే ఆ దేశంతో ఎటువంటి సంబంధాలు కొనసాగించం’ అని కిమ్ స్పష్టం చేశారు.