కొడుకు వైపా ? కూతురు వైపా ? ఇంతకీ విజయమ్మ ఎటువైపు? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న ప్రశ్న. అవును.. వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ తల్లి విజయమ్మ అడుగు లు ఎటువైపు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వై.ఎస్ విజయమ్మకు ఇప్పుడు కొత్త సంకటం వచ్చి పడింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎంగా ఆమె కుమారుడు వై.ఎస్ జగన్ ఉండగా.. ఇప్పటికే వైఎస్సార్ టీపీ అధినేత్రిగా ఉన్న ఆమె కూతురు షర్మిల, కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చిపడింది తల్లి విజయమ్మకు. కుమారుడు, కూతురు ఇద్దరూ రెండు కళ్లు అన్నట్లుగా చెప్పే తల్లి విజయమ్మ, ఇప్పుడు ఎవరి వైపు ఉంటారన్నదే ఆసక్తికరంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి, సొంతగా పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు వై.ఎస్ విజయమ్మ కుమారుడు వై.ఎస్ జగన్. అదే సమయంలో షర్మిల తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమిత మయ్యారు కుమార్తె షర్మిల. కారణాలు ఏవైనా కానీ, తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్ టీపీ తరపున పాదయాత్ర చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్‌కు చేరవయ్యారు. ఒకానొక దశలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగిం ది. కానీ, ఆ ప్రయత్నాలు విరమించుకొని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఒకటి రెండు రోజులు తిరగకముందే.. పోటీ నుంచి తప్పుకొని హస్తం పార్టీకి బేషరతుగా మద్దతునిచ్చారు షర్మిల.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసిన షర్మిలను హస్తం హైకమాండ్ ఏపీపై ప్రయోగించేందు కు సిద్ధమైందన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు పార్టీ ప్రచార బాధ్యతలను స్టార్ క్యాంపెయినర్ హోదాలో అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ పరిణామమే ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఒక్కసారిగా షర్మిల తోపాటు తెరపైకి వచ్చారు ఆమె తల్లి విజయమ్మ. నిజానికి వై.ఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పు డు పార్టీ భారాన్నంతా ఒంటి చేత్తో మోశారు వై.ఎస్ షర్మిల. జగనన్న విడిచిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు షర్మిల . అంతేకాదు ఎక్కడికక్కడ పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొని మరీ ప్రచారం సాగించారు. అయి తే ఆ తర్వాత కొంత కాలం బాగానే ఉన్నా, వై.ఎస్ జగన్, షర్మిల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి. చివర కు ఒకరంటే ఒకరికి పడడం లేదంటూ విపక్షాలు చెప్పడం మొదలపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వై.ఎస్ షర్మిల కాంగ్రె స్ పార్టీలో చేరడం లాంఛనం అన్న వాదన విన్పిస్తున్న నేపథ్యంలో వై.ఎస్ విజయమ్మఎవరి వైపు ఉంటారన్నది ఆసక్తి కరంగా మారింది.
మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో ఉండడంతో ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా పోయింది. అప్పట్లో షర్మిల వెంటే నడిచారు తల్లి వై.ఎస్ విజయమ్మ. కానీ, ఇప్పుడు షర్మిల పోషించబోయే పాత్ర ఏపీలో.. అదికూడా తన అన్నకు వ్యతి రేకంగా. మరిప్పుడు తల్లి విజయమ్మ ఎవరి వెంట ఉంటారు ? ముఖ్యమంత్రిగా ఉన్న కుమారుడి వెనుకా? లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్న తన కూతురు వెనుకా? ఇలాంటి పరిస్థితుల్లోఅమ్మ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.