22.7 C
Hyderabad
Monday, October 27, 2025
spot_img

Mukesh Ambani: అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే..

స్వతంత్ర వెబ్ డెస్క్: దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి ఇటీవల వరుస బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు పంపారు దుండగులు. అయితే తాజాగా ఈ కేసులో తెలంగాణ(Telangana)కు చెందిన 19 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు ముంబై పోలీసులు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మెయిల్స్ ద్వారా బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. కొద్దిరోజుల కింద వారం వ్యవధిలో దాదాపు 4 సార్లు బెదిరింపు ఇమెయిల్స్(Emails) వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత రూ. 20 కోట్లు, తర్వాత రూ. 200 కోట్లు.. ఆ తర్వాత రూ. 400 కోట్లు డిమాండ్ చేస్తూ.. అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగంతుకులు హెచ్చరించారు. అయితే ఈ కేసులో ఇప్పుడు ముంబై పోలీసులు(Mumbai Police).. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల ఒక కుర్రాడిని అరెస్టు చేశారు. నిందితుడిని గణేశ్ రమేశ్ వన్‌పర్ధి(Ganesh Ramesh Vanpardhi)గా గుర్తించారు. ఇతడిని ఇప్పుడు నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీలోనే ఉంచనున్నారు.

అంబానీకి మొదట అక్టోబర్ 27న మెయిల్(Mail) వచ్చింది. అప్పుడు రూ. 20 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే అంబానీ(Ambani)ని చంపేస్తామని హెచ్చరించాడు. తర్వాత మరో రెండు సార్లు కూడా ఇదే తరహాలో మెయిల్స్ వచ్చాయి. మొదటిసారి రూ. 20 కోట్లు అడిగిన దుండగుడు.. తర్వాత రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు. ఇక తర్వాత సోమవారం రోజు రూ. 400 కోట్లు డిమాండ్ చేశాడు. తన మెయిల్స్‌కు సరైన స్పందన లభించట్లేదని.. ఎంత సెక్యూరిటీ ఉన్నా తన దగ్గర స్పెషలిస్ట్ షూటర్ ఉన్నాడని.. కాల్చివేస్తాడని మెయిల్ చేశాడు.

ఈ బెదిరింపుల నేపథ్యంలో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) సెక్యూరిటీ ఇన్‌ఛార్జీ.. గామ్‌దేవీ(Gam Devi) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు .. ఇంటర్‌పోల్ ద్వారా బెదిరింపు మెయిల్ వివరాల్ని ధ్రువీకరించేందుకు బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ కంపెనీ (VPN) సహాయం కోరింది. అయితే.. shadabkhan@mailfence.com నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఐపీ బెల్జియం(Belgium)కు చెందిన నిపుణులు చెబుతున్నా. అతడు వేరే దేశంలో ఉండి పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు.

అయితే ఇప్పుడు ఆ నిందితుడిని తెలంగాణకు చెందిన కుర్రాడిగా గుర్తించి అరెస్టు చేశారు. అంబానీకి బెదిరింపు మెయిల్స్(Threatening mails) చేసినందునే అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు(Mumbai Police) తెలిపారు. శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి.. నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఇక బిహార్ దర్భంగాకు చెందిన ఒక వ్యక్తి గతేడాది ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌(Reliance Foundation Hospital)కు ఫోన్ చేసి.. అంబానీ, ఆయన కుటుంబాన్ని అంతమొందిస్తానని హెచ్చరించారు. ఇక అంతకుముందు అంబానీ .. ఆంటిలియా నివాసం ముందు పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఒక స్కార్పియోను కూడా పోలీసులు గుర్తించారు. అప్పుడు కూడా అంబానీకి భద్రతను పెంచారు.

గతంలోనూ అంబానీకి బెదిరింపులు

ముకేష్‌ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా గతంలో బెదిరింపులు వచ్చాయి. అంబానీ నివాసం ఆంటిలియాను పేల్చేస్తామని, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చేస్తానని దుండగులు బెదిరించగా, పోలీసులు వాళ్లను అరెస్ట్‌ చేశారు. 2021లో, అంబానీ నివాసానికి అతి సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు దొరికాయి. జెలిటిన్ స్టిక్స్‌తో పాటు, ఇది ట్రైలర్‌ మాత్రమే అంటూ ఓ లెటర్‌ కూడా దొరికింది. ఆ కేసులో, ఒక ముంబై పోలీసు అధికారి అరెస్టు కావడంలో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అంబానీ భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్