స్వతంత్ర వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్(Trisha)గా నటించగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల దూకుడు కొనసాగిస్తోంది. ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.450 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రూ.500 కోట్ల కబ్‌లో అడుగుపెట్టేందుకు ఉరకలు వేస్తోంది. ఈ సినిమా గత గురువారం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా ప్రదర్శనలో తాజాగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. లియో సినిమా స్క్రీనింగ్(Screening) అవుతుండగా ఓ వ్యక్తి థియేటర్ లో స్క్రీన్ ను చింపివేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. విజయ్(Vijay) సినిమాపై కోపంతో ఇలా చేశారా..? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. ఎగ్జిబిటర్(Exhibitor)కు నష్టాలు రావడంతోనే చింపివేశారని నెట్టింట వైరల్(Viral) అవుతోంది. సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తుంటే ఇంకా నష్టాలు ఎలా వస్తాయని అభిమానులు అంటున్నారు. కాగా.. అతను గతంలో యూఎస్‌లోని ప్రముఖ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్ ద్వారా నష్టపోయి ఉండవచ్చునని ఆ కోపంతోనే ఇలా చేశారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. లియో(LEO) సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తొలిరోజుతో పోల్చితే కాస్త తగ్గాయి కానీ.. పర్వాలేదనిపించే కలెక్షన్‌లే వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమా జోరు మాములుగా లేదు. మూడు రోజుల్లోనే రూ.30 కోట్లు కొల్లగొట్టింది. పోటీగా భగవంత్ కేసరి(Bhagwant Kesari), టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాలున్నా ఈ రేంజ్‌లో లియో కలెక్షన్‌లు సాధిస్తుందంటే విశేషం అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు లియో సినిమా రూ.400 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
ఇండియాలోనే రూ.250కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, లియో కలెక్షన్లపై కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే మరో రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్‌ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి మరి.
లియో సినిమాలో విజయ్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన మార్క్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లియో చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటించారు. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మడోనా సెబాస్టియన్, జార్జ్ మర్యన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. లియో చిత్రానికి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అందించిన బ్యాక్‍గ్రౌండ్ కూడా పెద్ద ప్లస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ పరమహంస(Manoj Paramahamsa) సినిమాటోగ్రఫీ కూడా మరో బలంగా నిలిచింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు.
లియో మూవీ డిజిటల్ హక్కులను(Digital rights) ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్(Netflix) కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆ ప్లాట్‍ఫామ్ రైట్స్ దక్కించుకుంది. కాగా, లియో సినిమా నవంబర్ నాలుగో వారంలో ఓటీటీలోకి వస్తుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. నవంబర్ 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లియో మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుందంటూ సమచారం చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, లియో ఓటీటీ రిలీజ్ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.