32.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా?- అచ్చెన్నాయుడు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు పిలుపునిస్తున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు…వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ జగన్ పెత్తందారి తనం మరొక సారి రుజువు చేసుకున్నారని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయమని.. అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు…శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు…చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు.ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్టులు ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. చట్టాన్ని జగన్ రెడ్డి చుట్టంలా వాడుకుంటూ కొంత మంది పోలీసులను వైసీపీ ప్రైవేటు సైన్యంలా మార్చుకొని అరాచకానికి నాంది పలుకుతున్నారని వెల్లడించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్