28.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

ఎంతకు తెగించార్రా.. ఏకంగా బస్టాప్ చోరీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  కాదేదీ చోరీకి అనర్హం అన్నట్లు దొంగలు ఏది దొరికితే దాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఏకంగా బస్టాప్‌నే దొంగిలించిన ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. అది కూడా రాష్ట్ర అసెంబ్లీకి కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. ఇక దాన్ని అక్కడ ఏర్పాటు చేసిన పది రోజులకే దుండగులు ఎత్తుకెళ్లిపోవడం విచిత్రం. అయితే ఇంతకీ ఆ బస్టాప్ ఎక్కడ ఉంది. దాని సంగతేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కర్ణాటకలో బస్టాప్‌ను దుండగులు ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ బస్టాప్ ఏదో మారు మూల ప్రాంతంలో ఉంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది రాజధాని బెంగళూరు నడిబొడ్డున కర్ణాటక రాష్ట్ర శాసనసభకు కిలో మీటర్ దూరంలోనే ఉండటం విశేషం. ఇక ఆ బస్టాప్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు కాగా.. దాన్ని ప్రారంభించిన 10 రోజులకే దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగళూరు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్‌ రోడ్‌లో ఈ బస్టాప్‌ను నిర్మించారు. ఈ బస్టాప్ నిర్మాణాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలిక-బీబీఎంపీ.. స్థానికంగా ఉన్న ఓ కంపెనీకి పనులు అప్పగించారు. అయితే ఈ బస్టాప్‌ను రూ. 10 లక్షలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఈ బస్టాప్‌ నిర్మించిన పది రోజులకే దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బస్టాప్ నిర్మించిన కంపెనీ అధికారు రవిరెడ్డి.. సెప్టెంబర్ 30 వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆ బస్ షెల్టర్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశామని.. దానికి మొత్తం రూ.10 లక్షల ఖర్చు వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ బస్టాప్‌తోపాటు దానికి ఉన్న స్టీల్ కడ్డీలు మొత్తం దొంగలు ఎత్తుకెళ్లిపోయారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఆ కంపెనీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేశారు. ఆ బస్ షెల్టర్‌ను ఆగస్టు 21 వ తేదీన ఏర్పాటు చేశామని.. అయితే ఆగస్టు 28 వ తేదీన బస్టాప్‌ను చూసేందుకు వెళ్లగా అక్కడ ఏమీ కనిపించలేదని తెలిపారు. అయితే ఈ బస్టాప్ దొంగతనం జరిగిన నెల రోజుల తర్వాత సదరు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే బస్టాప్ కనిపించకపోవడంతో బృహత్ బెంగళూరు మెట్రోపాలిక అధికారులను సదరు కంపెనీ ప్రశ్నించగా.. వారు తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

ఈ ఘటనకు ముందు ఈ ఏడాది మార్చిలో హెచ్ఆర్‌బీఆర్ లే అవుట్ వద్ద 30 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాప్‌ రాత్రికి రాత్రే మాయం అయింది. అయితే కళ్యాణ్ నగర్‌లో ఉన్న బస్టాండ్‌ను 1990 లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చిందని స్థానికులు తెలిపారు. అయితే కమర్షియల్ స్పేస్ కోసం దాన్ని రాత్రికి రాత్రే తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఆ బస్టాప్‌ను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు తొలగించినట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే బెంగళూరు నగరంలో ఇలా బస్టాప్‌లు మాయం కావడం గతంలో కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. 2015 లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్టాప్ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. అంతకుముందు 2014 లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్‌ లేఅవుట్‌ 3 వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్‌ కూడా దుండగుల చోరీకి గురైంది.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్