స్వతంత్ర వెబ్ డెస్క్: సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే… దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్ అగ్రనేతలకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలు రెండ్రోజుల పాటు హైదారాబాద్‌లోనే ఉండనున్నారు. హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి.