స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఇకపై చిప్పకూడు తినాల్సిందేనని అన్నారు మంత్రి ఆర్కే రోజా. అక్రమ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అన్ని సాక్ష్యాలతో దొరికిపోయిన తర్వాత కక్ష సాధింపు చర్యలు అంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని కేసులో స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్లు కాలం గడిపాడని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, మంత్రి రోజా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగాయి. తప్పులు చేసే చంద్రబాబుకి శిక్షపడాలని దేవున్ని కోరుకున్నాను. సాక్ష్యాధారాలతో జైలుకు వెళ్లారు చంద్రబాబు. స్నేహా బారక్‌లో ప్రత్యేక గది ఇచ్చి, ఖైదీ నెంబర్ 7691ను చంద్రబాబుకు ఇచ్చారు. సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత చంద్రబాబుకి ఏర్పాటు చేశారు. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు బయట ఓవరాక్షన్ చేస్తున్నారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ప్రజల ఉపాధి కోసం ఏర్పాటు చేసింది. అందులో అడ్డంగా దోచేశారు. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని విద్యార్థులను బాబు మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. అది కూడా లేదు. కానీ, తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకున్నాడు. 2024లో టీడీపీకి ప్రజలకు తగిన బుద్ధిచెప్పాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చంద్రబాబు ఇకపై చిప్పకూడు తినాల్సిందే- మంత్రి రోజా
Latest Articles
- Advertisement -