స్వతంత్ర వెబ్ డెస్క్: రిజర్వ్ డే రోజు టీమిండియా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ వీరవిహారం సృష్టించారు. ఆసియా కప్ లో భాగంగా టీమిండియా పాకిస్థాన్ సూపర్4 మ్యాచ్ లో తలపడ్డాయి. నిన్న ఆదివారం వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. మిగిలిన మ్యాచ్ ఈ రోజు ప్రారంభమైంది. నిన్న రోహిత్ శర్మ , గిల్ హాఫ్ సెంచరీలతో పాక్ బౌలర్లను ఉతికారేస్తే.. నేడు కేఎల్ రాహుల్, కింగ్ కోహ్లీ చెరో సెంచరీ సాధించి పాక్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో గెలుపొంది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది.
పాకిస్తాన్ బ్యాటర్లలో ఫకార్ జమాన్ (27), ఆఘా సల్మాన్ (23) ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ పేలవంగా సాగింది. కొంచెం కూడా పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా, బుమ్రా, పాండ్య, శార్దూల్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఈ సూపర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (122 నాటౌట్; 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (111 నాటౌట్; 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదారు. ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీ కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఆరో శతకం , విరాట్ కోహ్లీకి 47వ సెంచరీ ఓపెనర్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 56; శుభ్‌మన్ గిల్ 58 అర్థశతకాలతో సత్తా చాటారు.