నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సింప్లిసిటీని చాటుకుంది. తన వద్ద పని చేసే అసిస్టెంట్ పెళ్లికి వెళ్లి సందడి చేసి అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌లోని బహుదూర్ పల్లిలో జరిగిన తన అసిస్టెంట్ సాయి పెళ్లికి రష్మిక హాజరయ్యారు. ఆమె రాకతో అక్కడున్న వారు ఆనందంతో పొంగిపోయారు. నూతన జంటను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక హీరోయిన్ గా నటించిన యానిమల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో రణ్ భీర్ కపూర్ హీరో. సందీప్ వంగా దర్శకత్వం వహించారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోనూ ఆమె నటిస్తున్నారు. వెర్సటైల్ స్టార్ ధనుష్, శేఖర్ కమ్ముల మూవీలోనూ రష్మిక నటిస్తున్నారు. వీటితో పాటు రష్మిక ప్రధాన పాత్రలో రెయిన్ బో అనే సినిమా కూడా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.