స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశంలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత నమ్మకద్రోహి, అత్యంత స్వార్థపరుడు, దొంగ, 420 చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని దోచుకునే వ్యక్తి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, మాజీ మంత్రి కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. చట్టాలు, వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అని చంద్రబాబు. టీడీపీ అధినేత ఎలాంటి అవినీతి చేయకుంటే సింగపూర్‌లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పారని, అవినీతి చేయకుంటే అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు.
చంద్రబాబు రెండెకరాల నుండి అంతా ఏమైనా న్యాయంగా సంపాదించాడా? అని ప్రశ్నించారు. అందుకే ఆయనమీద ఎలాంటి కేసులు లేవా?. తానేదో నీతిపరుడిని అయినట్లుగా ప్రత్యర్థుల పైన బురదజల్లుతూ జైలుకు పంపించాలనుకునే వ్యక్తి అన్నారు. తిరుపతి బస్టాండ్ దగ్గర కర్జురకాయలు అమ్మిన వ్యక్తి చంద్రబాబు. దేశంలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత నమ్మకద్రోహి, అత్యంత స్వార్థపరుడు, దొంగ, 420 చంద్రబాబు. చంద్రబాబులా తాము ఖర్చు చేస్తే 2014లోనే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. అమరావతి పేరుతో రూ.118 కోట్లు దోచుకున్న దొంగ అన్నారు.


