స్వతంత్ర వెబ్ డెస్క్: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షం కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.