స్వతంత్ర వెబ్ డెస్క్: తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్, సీఈవోగా మహిళను నియమించారు. 105 ఏళ్ల చరిత్రలో ఈ రైల్వే శాఖలో నియమితులైన తొలి మహిళ జయ వర్మ సిన్హా. ఆమె పేరు గురువారం ప్రకటించబడింది. నేడు అంటే సెప్టెంబర్1,2023న జయ వర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. జయ వర్మ రైల్వే బోర్డులో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. రైల్వే బోర్డులో కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధి విభాగంలో ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయ వర్మ భారతీయ రైల్వేలో తన 35 సంవత్సరాల సమయాన్ని వెచ్చించారు. దీని తరువాత ఇప్పుడు ఆమెకు రైల్వే ఛైర్మన్, CEO పదవిని ఇచ్చారు.
జయ వర్మ అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె నిజానికి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1986 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు చెందినది. ప్రస్తుతం రైల్వే బోర్డు చీఫ్‌గా ఉన్న అనిల్ కుమార్ లోహతి స్థానంలో సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు విజయలక్ష్మి విశ్వనాథన్, అయితే జయ వర్మ బోర్డుకు మొదటి మహిళా చైర్మన్, CEO అయ్యారు.