స్వతంత్ర వెబ్ డెస్క్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో.. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఇక, ఈ సందర్భంగా చంద్రబాబు కూడా అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం కథాంశం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంటుంది. పుష్ప పార్ట్-1 మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. పార్ట్-2 షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే పుష్ప చిత్రంలో ఓ సందర్భంలో పోలీసు స్టేషన్ గోడపై చంద్రబాబు ఫొటో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పుష్ప చిత్రం విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి.
పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. పుష్ప చిత్రంలో తన ఫొటో పెట్టినందుకు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని అన్నారు. ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ.. ‘‘పుష్ప చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్‌లో నా ఫొటో ఉంది. ఆ సినిమా చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను చేశాననో చిత్ర యూనిట్ నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు’’ అని పేర్కొన్నారు.


