మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రేపే. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను భారీగా ప్లాన్ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను మంగళవారం జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరపబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం మొదలు కాబోతోంది. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగా హీరోలతో పాటు అనేకమంది సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరపాలని నిర్ణయించిన అఖిల భారత చిరంజీవి యువత.. ఇప్పటికే ఆ దిశగా భారీ ఏర్పాట్లు చేసింది.