స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ లో ఎక్కువ మంది ఓసీలే(OC) ఉంటే సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందని సీఎం కేసీఆర్ ను(CM KCR) కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) ప్రశ్నించారు. తాను మొదటి సారి ఎమ్మెల్యే అయిన సమయంలో మంత్రి కేటీఆర్(Minister KTR) అమెరికాలో బాత్ రూంలు కడుగుతున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(Yadadri Bhuvanagiri,) పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ కేసీఆర్ అని హెచ్చరిచారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ మాత్రమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వర్షాల వల్ల పంటలు నష్టపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి ఏమీ అవసరం లేదని..బతుకు తెలంగాణ కావాలని వ్యాఖ్యానించారు. తనకు వ్యాపారాలు లేవని… గుట్టలు, కొండలు అమ్ముకొనని చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి కేసీఆర్ గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేశారని విమర్శించారు.


