ప్రపంచానికి నాయకత్వం వహించేలా భారత దేశం ఎదగాలని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆకాంక్షించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా యోగా సెంటర్‌లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సద్గురు పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, సాంకేతిక పరంగా కూడా ఉన్నత శిఖరానికి చేరిందని సద్గురు తెలిపారు. దేశ ప్రజలంతా కుల, మతాలకు అతీతంగా దేశ ప్రగతికి, అభ్యున్నతి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సద్గురు సూచించారు.