20.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటమే పవన్ కు అలవాటు- పేర్ని నాని

స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్(Chief Minister Jagan) పై జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, వైసీపీ(YCP) ఎమ్మెల్యే పేర్ని నాని(MLA Parni Nani) మండిపడ్డారు. నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటమే పవన్ కు అలవాటని… జనం నవ్వుకుంటారని కూడా ఆయనకు లేదని అన్నారు. చంద్రబాబు కోసం పని చేస్తున్నాననే విషయాన్ని పవన్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండూ కలిసే పని చేస్తాయని… టీడీపీ ఇన్ఛార్జీని పెట్టిన చోట జనసేన ఇన్ఛార్జీలను పెట్టబోమని చెప్పాలని అన్నారు. సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నావని దుయ్యబట్టారు. వైసీపీ నుంచి ఎవరినీ పార్టీలోకి రానివ్వనని చెప్పిన పవన్.. ఇప్పుడు ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ వి నిలకడలేని రాజకీయాలని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో జగన్ ను ఆటాడించే శక్తి కనుక ఉంటే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్