స్వతంత్ర వెబ్ డెస్క్: నిన్న లోక్‌సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలదీశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాల తీరు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై(Congress) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.
సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్ (Manipur)పరిస్థితిని సరిదిద్దేది. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయాయి. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధానిగా మోదీ కనీసం మణిపూర్‌కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వాల్సింది. నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని ఆయన అనాల్సింది. కానీ, ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు. మణిపూర్ మంటలు ఆరడం ఆయనకు ఇష్టం లేనట్లుంది అని రాహుల్ అన్నారు.


