37.2 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు.. మంత్రి అంబటి కౌంటర్ ట్వీట్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బ్రో(BRO ) సినిమా రెమ్యూనరేషన్, శ్యాంబాబు క్యారెక్టర్‌పై వివాదం రేగితే. నిన్న భోళా శంకర్(Bola Shankar) సినిమా టికెట్లు వివాదం తెరపైకి వచ్చింది.. ఈలోపు పవన్ కళ్యాణ్‌పై(Pavan Kalyan) మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai)సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఆమె పవన్, బ్రో సినిమా వివాదం గురించి ప్రస్తావించారు.. ఈ క్రమంలో రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Ram Babu)ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అని ట్వీట్(Tweet) చేశారు. మంత్రి బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను ప్రస్తావించారు.
మంత్రి ట్వీట్‌కు జనసైనికులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటో చూడాలని చురకలంటించారు. రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ మధ్య విడుదలైన సినిమాలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయని తనకు తెలిసిందన్నారు. ఆ వివాదం ఏంటో తనకు పెద్దగా తెలియదని.. అయితే పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని.. పవన్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలు గురించి ప్రస్తావన ఉంటుందని కొందరు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఒక తల్లిగా పిల్లల్ని ఈ వివాదాల్లోకి లాగొద్దని వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశారు. రాజకీయాల్లోకి తన పిల్లలనే కాదు.. ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ఇరువురు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్