స్వతంత్ర వెబ్ డెస్క్: లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఒక్కటై తెలంగాణను దోచుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లోక్‌సభ వేదికగా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. బీజేపీ(Bjp), బీఆర్‌ఎస్(Brs) పార్టీలపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో జాతుల మధ్య వైరం పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని రేవంత్ ఆరోపించారు. మణిపూర్ మండిపోతుంటే, అక్కడ రక్తం ఏరులై పారుతుంటే ప్రధాని, హోంమంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మణిపూర్‌కి వెళ్లి అక్కడి ప్రజలను రక్షించాల్సిన ప్రధాని, హోంమంత్రి ఓట్ల వేట కోసం కర్ణాటకకు వెళ్లినందునే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని తిరస్కరించారన్నారు. బీజేపీకి ప్రజల మాన, ప్రాణాలకంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్డీఏ అంటే నేషన్ డివైడ్ అలియన్స్ అన్న రేవంత్‌రెడ్డి.. బీజేపీ మేనిఫెస్టోలు ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు అని విమర్శించారు.