స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖపట్నం నుంచి చేపట్టబోయే వారాహి యాత్రకు(Varahi) పోలీసులు అనుమతి ఇచ్చారు. కాకపోతే కొన్ని కండీషన్స్ పాటించాలని సూచించారు. కాగా ఈ యాత్ర రేపటి (ఆగస్టు 10) నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. యాత్ర అనుమతి కోసం జనసేన నాయకులూ పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ భద్రతా కారణాల దృష్ట్యా క్రేన్లను ఉపయోగించి పవన్ కళ్యాణ్ కు గజమాలను వేయవద్దని జనసేన కార్యాలయం నుంచి ఓనోట్ వెలువడింది. పవన్ వారాహి వాహనం చుట్టూ ఇతర వాహనాలు ర్యాలీగా వెళ్ళేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ఈ యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు జగదాంబ సెంటర్ లో మాత్రమే సభకు అనుమతినిచ్చారు. అలాగే ర్యాలీలు చేయకూడదని నిబంధన పెట్టారు. అలాగే కార్యకర్తలు భవనాలు, నిర్మాణాలపై ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీదే అని పోలీసులు తెలిపారు. ఇందులో ఏ నిబంధనలు పాటించకున్నా అనుమతి పొందిన వారిదే బాధ్యతన్నారు.అందుకోసం వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు తదితర అంశాలన్నింటినీ ఈ కమిటీలు చూసుకోనున్నాయి.