24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

రూటు మార్చిన నాగార్జున..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల ది ఘోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన ది ఘోస్ట్ మూవీ ఫరవాలేదు అనిపించింది కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మెప్పించలేకపోయింది. నాగార్జున ఈమధ్య నటించిన యాక్షన్ మూవీస్ వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో రూటు మార్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. నాగ్ ప్లాన్ ఏంటి..? నెక్ట్స్ మూవీ ఎప్పుడు..?

కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలతో మెప్పించారు కానీ.. యాక్షన్ మూవీస్ వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలతో మెప్పించలేకపోయారు. దసరాకి వచ్చిన ది ఘోస్ట్ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాగార్జున ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేయాలి అని బాగా ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ 6 సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత ఏ సినిమా చేయాలి అనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారట. జనవరిలో కొత్త సినిమాని ప్రకటించనున్నారని సమాచారం.

గాడ్ ఫాదర్ మూవీని తెరకెక్కించిన మోహనరాజా డైరెక్షన్ లో నాగార్జున సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. మోహనరాజా కూడా నాగార్జునతో సినిమా చేయనున్నట్టుగా ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్.. ఇక అఫిసియల్ గా అనౌన్స్ చేయడమే తరువాయి అనుకున్నారు. నాగార్జున ది ఘోస్ట్ రిలీజైన తర్వాత ఈ సినిమాని ప్రకటించాలి అనుకున్నారు. అయితే.. ది ఘోస్ట్ మూవీ ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆలోచనలో పడ్డారట. మోహనరాజా ఇప్పుడు హిందీ మూవీ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇక నాగార్జున రూటు మార్చి ఈసారి రీమేక్ మూవీ చేయాలి అని డిసైడ్ అయ్యారని సమాచారం.

ఇంతకీ ఏ మూవీని రీమేక్ చేస్తారంటే.. మలయాళంలో విజయం సాధించిన పోరింజు మరిమమ్ జోస్ అని టాక్ వినిపిస్తోంది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో జోషీ రూపొందించిన ఈ మూవీ ఇది. 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసిన నాగార్జున ఇంప్రెస్ అయ్యారట. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రినాథరావు నక్కిన రూపొందించిన పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ రీమేక్ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని సమాచారం. ఈ రీమేక్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా నాగార్జున సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Latest Articles

ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. ఇక ఇందిరాగాంధీ భవన్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్‌ అని పేరు పెట్టారు. 5 అంతస్తుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్