Kokapet Land Auction : కోకాపేట భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.72 కోట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: భూముల వేలంలో కోకాపేట కేక పుట్టిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్‌ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు.. రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. గురువారం రెండో విడత కింద భూముల వేలం చేపట్టింది హెచ్ఎండీ. ఫేజ్ 2లో భాగంగా భాగంగా 6,7,8,9 ప్లాట్లకు వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఈ వేలం ప్రక్రియలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లుగా పలికింది. నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో.. ఇప్పటివరకు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎకరాలకు వేలం పూరైంది.

ఇక గురువారం సాయంత్రం 6 గంటల వరకు 18.47 ఎకరాలకు వేలం నిర్వహించనుంది హెచ్ఎండీఏ. ప్రస్తుతం నియో పోలిస్‌లోని 9, 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. వేలం జరుగుతున్న ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంటోంది హెచ్‌ఎండీఏ. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరనే రూ. 35 కోట్లుగా ఉంది. కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌లోని భూముల వివరాలు చూస్తే… ప్లాట్‌ నెంబర్‌ ఆరులో 7 ఎకరాల భూమి ఉంది. ప్లాట్‌ నెంబర్‌ 7లోని చూస్తే 6.55 ఎకరాలు, 8లో 0.21 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 14లో 7.34 ఎకరాల భూమి ఉంది.
ఇలా మొత్తం 45.33 ఎకరాల భూమిని వేలం వేయనుంది హెచ్ఎండీఏ. కోకాపేటలో మొదటి విడత పూర్తి తర్వాత ప్రస్తుతం రెండో విడత భూముల వేలం చేపట్టింది హెచ్ఎండీఏ. నియోపొలిస్‌ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఇందుకోసం కంపెనీలు, ట్రస్టులు, రిజిస్టర్డ్‌ సొసైటీలు, ఆర్థిక సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. జులై 20న ప్రిబిడ్‌ సమావేశం నిర్వహించారు. జూలై 31 వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజులను స్వీకరించారు. ముందస్తు డిపాజిట్‌ కింద ఆగస్టు 1లోగా ప్రతీ ప్లాటుకు రూ.5 కోట్లు చెల్లించారు. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈవేలం ప్రక్రియను చేపట్టారు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్