అచ్చతెలుగమ్మాయి… కుందనపు బొమ్మలాంటి పడుచుపిల్ల.. చీరకట్టులో అయినా.. మోడ్రన్ డ్రెస్‌లో అయినా.. కుర్రాళ్ల మనసు దోచే ఎల్లోరా శిల్పం.. నటనతో కట్టిపడేసే నేర్పు ఆమె సొంతం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘వకీల్ సాబ్’లో చేసినా.. సమంతతో కలిసి ‘శాకుంతలం’లో నటించినా.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటే వెళ్లడమే ఆమె నైజం! అందుకే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది అనన్య.
‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన అనన్య.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెంకటేశ్వరరావు, విష్ణుప్రియ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త. అనన్య చదువుల కోసం ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. అనన్య ఇబ్రహీంపట్నంలోని రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసింది. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఇన్ఫోసిస్‌లో పనిచేసింది. ఇన్ఫోసిస్‌లో చేస్తున్నప్పుడే ఆమెకు ‘మల్లేశం’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ప్లేబ్యాక్’ లాంటి స్కైఫై సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో అదరగొడుతోంది. సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా అనుకున్న రిజల్ట్ సాధించకపోయినా.. అనన్య పోషించిన చెలికత్తె పాత్ర మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక రీసెంట్‌గా వచ్చిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రంలో పవిత్ర లోకేష్ యంగ్ ఏజ్ పాత్రలో అనన్య ఒదిగిపోయింది. పవిత్ర కుర్ర హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో చూడనివాళ్లకు అనన్య లుక్ కళ్లకు కట్టినట్లు చూపించింది. అందులో తన అందాలతో అందర్నీ బాగా కట్టిపడేసింది. తెలుగు అమ్మాయి అయిన అనన్య చూడ్డానికి మంచి ఫిజిక్‌తో పాటు మంచి లుక్‌తో ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ స్టిల్స్‌ను షేర్ చేస్తుంటుంది. అందులో బాగా గ్లామర్ ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది. దీంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. అనన్య షేర్ చేసే ఫొటోలు చూసిన అభిమానులు ఆమెను నాజూకు నడుము సుందరి అంటూ ఇలియానాతో పోలుస్తుంటారు. తెలుగమ్మాయి.. పైగా నటనతో పాటు గ్లామర్ కూడా ఉండడంతో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనన్య ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అనన్య నటిస్తున్న సినిమాలు…
ఫిక్సెల్ పిక్చర్స్ పతాకంపై జీ5 ఓటీటీ కోసం ముకేష్ ప్రజాపతి రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో అనన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ అండ్ బి ద వే ఫిల్మ్ నిర్మిస్తున్న ‘తంత్ర’ అనే సినిమాలో అనన్య యాక్ట్ చేస్తోంది. బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై వస్తున్న ‘లేచింది మహిళా లోకం’ సినిమాలో కూడా అనన్య నటిస్తోంది. ఈ చిత్రానికి అర్జున్-కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ వేగేష్న నెక్ట్స్ మూవీలో కూడా అనన్య సెలెక్ట్ అయింది. ‘నల్లమల’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రవి నూతన చిత్రం ‘నవాబ్’లో అనన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత మోహన్ దర్శకుడిగా, శ్రీగణపతి సినిమాస్ బ్యానర్‌లో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్న చిత్రంలోనూ అనన్యను హీరోయిన్‌గా తీసుకున్నారు. అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాజా రామ్మోహన్ చల్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. వెన్నపూస రమణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీకాకుళం యాసలో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ‘సవారీ’ డైరెక్టర్ సాహిత్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో కూడా అనన్య హీరోయిన్‌గా ఎంపికైంది.
నేడు అనన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న పలు సినిమాల నుంచి ఆమె లుక్‌ను రిలీజ్ చేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. అనన్య ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.. ఆమె మరెన్నో గొప్ప సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లాలని కోరుకుందాం.