స్వతంత్ర వెబ్ డెస్క్: కరేబియన్ దీవుల్లో ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నది. భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని విడుదల చేసింది. భారత జట్టులోని ఆటగాళ్లందరూ కొత్త జెర్సీతో ఫొటోషూట్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. పలువురు క్రికెటర్లు సైతం కొత్త జెర్సీలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జెర్సీలో భారత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనున్నది.
అలాగే ఆస్ట్రేలియా, ఆసియా క్రీడల్లోనూ టీమిండియా అదే జెర్సీతో కనిపించనున్నది. లేత నీలం రంగు జెర్సీలో కొన్ని ముదురు నీలం గీతలు ఉండగా.. అలాగే ఎడమవైపున బీసీసీఐ లోగో ఉండేలా డిజైన్ చేశారు. అలాగే జట్టు స్పాన్సర్ డ్రీమ్ 11 పేరుతో పాటు పేరును సైతం జెర్సీ ముందు భాగంలో ఉండేలా ఏర్పాటు చేశారు. అడిడాస్ లోగో ఛాతీకి కుడి వైపున ఉంటుంది. జెర్సీపై రెండు వైపులా మూడు తెల్లటి చారల మారిదిగా స్ట్రిప్స్ ఉండగా.. కాలర్, స్లీవ్స్‌లో ఆరెంజ్ కలర్‌తో డిజైన్ చేశారు. టెస్టుల సందర్భంగా విడుదల చేసిన జెర్సీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ‘డ్రీమ్ ఎలెవన్’ పెద్దగా ముద్రించడం, దేశం పేరును తొలగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.