22.7 C
Hyderabad
Wednesday, December 4, 2024
spot_img

గుజరాత్‌లో 150చోట్ల బీజేపీ ఆధిక్యం

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, కమలం హోరాహోరీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేపట్టారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం గుజరాత్‌లో బీజేపీ మరోమారు అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 150పైగా స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే, బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్తంత ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు.

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అనేక చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టి బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా..ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ను బట్టి చూస్తే….అనేక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. దీంతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన మొదటి విడతలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అలాగే డిసెంబర్ ఐదో తేదీన జరిగిన రెండో విడతలో 93 సెగ్మెంట్ లకు పోలింగ్ నిర్వహించారు. మొదటి విడతలో 63.31 శాతం,రెండో విడతలో 65.22 శాతం పోలింగ్​ నమోదైంది.

గుజరాత్‌ను బీజేపీ కంచుకోటగా పేర్కొంటారు. గుజరాత్ లో పాతికేళ్లకు పైగా బీజేపీ అధికారంలో ఉంది. వరుసగా ఏడోసారి జయభేరి మోగించాలని ఊవిళ్లూరుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా బీజేపీ విజయం తథ్యమని అంచనా వేశాయి. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్‌ 92 సీట్లు కాగా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీకు 117 నుంచి 151 సీట్ల వరకు రావచ్చని లెక్కగట్టాయి. కాంగ్రెస్‌ పార్టీకి 16 నుంచి 51, ఆమ్‌ఆద్మీకి 2 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న గట్టి పట్టుదలతో పనిచేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి గట్టి సవాల్ ఎదురైంది. ఒక దశలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీయే గుజరాత్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. గెలుపు అవకాశాలు లేవనుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వలేదు. ఇతర పార్టీల నుంచి వలసలకు తలుపులు బార్లా తెరిచారు. అనేకచోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకున్నాయి. బీటీపీకి రెండు, ఎన్సీపీకి ఒకటి, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి బీజేపీ సభ్యుల సంఖ్య 110కు చేరింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన 20 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారిలో ముగ్గురు ఎన్నికలకు ముందు పార్టీ మారారు.

ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తే ఓబీసీ వర్గానికి చెందిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. గుజరాత్ లో ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గఢ్వీని ఎంపిక చేయడం ద్వారా ఓబీసీ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేయడం ఈజీ అయ్యిందంటున్నారు రాజకీయ పండితులు. గుజరాత్ ఎన్నికల్లో విజయానికి అభివృద్దినే నమ్ముకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సంక్షేమ వాదానికే పెద్ద పీట వేసింది. నెలకు, మూడు వందల యూనిట్ల ఉచిత కరెంటు, పిల్లలకు ఉచిత విద్య, నిరుద్యోగ యువతకు భృతి ఇవన్నీ ..గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాస్త్రాలుగా మారాయి.

కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీ.!
ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చే సంస్కృతి ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉందని వెల్లడవగా.. ఇప్పుడు ట్రెండ్స్ కూడా అలాగే కొనసాగుతున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ 21, సీపీఎం 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు.

Latest Articles

పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్న జగన్‌

పార్టీ బలోపేతంతోపాటు కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనుంది వైసీపీ. పార్టీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలో జరగనున్న సమావేశంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్