- జిన్‌పింగ్ దిగిపోవాలంటూ ఆందోళనలు
- కార్చిచ్చులా వ్యాప్తిస్తున్న వైట్‌పేపర్ రెవెల్యూషన్
చైనాలో కోవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా ఆందోళనలతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. కట్టడి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఆదివారం షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్‌డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది.
దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్ పేపర్ రివల్యూషన్’పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది.