స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్ బెన్ ప్రధాని మోదీ పాదాలకు నమస్కారం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని గాయని చేతులను పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు మిల్ బెన్ భారత జాతీయ గీతం జనగణ మన అంటూ ఆలపించింది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపునకు చిహ్నంగా జాతీయ గేయాన్ని ఆలపించారు. యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ గేయాన్ని ఆలపించే అవకాశం మిల్ బెన్ కు వచ్చింది. మిల్ బెన్ (38) ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్. ఆమె హాలీవుడ్ నటి కూడా. తనకు ఆ అవకాశం ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు మిల్ బెన్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా, భారత జాతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్య ఆదర్శనాలను, స్వేచ్ఛను తెలియజేస్తాయి. అమెరికా-భారత్ అసలైన బంధాల సారాంశం ఇది. స్వేచ్ఛాయుత దేశం అన్నది ప్రజల స్వేచ్ఛ ద్వారానే నిర్ణయించబడుతందని మిల్ బెన్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించిన ప్రముఖ అమెరికన్ సింగర్
0
473
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


