స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. జూన్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. సోమవారం కూడా అదే ట్రెండ్ ను కొనసాగించింది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లను వసూలు చేసింది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ… రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సోమవారం నాడు ఏపీలో రూ. 2.69 కోట్లు, నైజాంలో రూ. 2.74 కోట్లను వసూలు చేసింది. ఒక పక్క ట్రోల్ల్స్ ఎదుర్కొన్నప్పటికీ సినిమా భారీ వసూళ్లు దిశగా ముందుకి వెళ్తుంది.
నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లను వసూలు సాధించిన ఆదిపురుష్
Latest Articles
- Advertisement -