స్వతంత్ర వెబ్ డెస్క్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాడమాసం మొదటి మంగళవారం బల్కంపేటలో ఎల్లమ్మ మాతృ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసం మొదటి మంగళవారం బల్కంపేటలో ఎల్లమ్మ మాతృ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చివరగా రేపు సాయంత్రం రథోత్సవం జరగనుంది. దాంతో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగియనున్నాయి.
కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి తోటి భక్తులు సపర్యలు చేశారు. వీఐపీ పాస్‌లు ఎక్కువగా ఇచ్చారని.. సామాన్యులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.