స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషనర్ అధ్వర్యంలో ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించబోయే గ్రూప్-1 పరీక్ష నిర్వహించబడే పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ పరీక్ష భద్రత ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమవేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఉదయం పది గంటల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వబడే ఈ పరీక్షకు 34162 మంది అభ్యర్థులు హజరువుతుండగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 89 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించబడుతోంది.
ఇందులో సెంట్రల్ పరిధిలో 70, ఈస్ట్ జోన్ పరిధిలో 5, వెస్ట్ జోన్ పరిధిలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఈ పరీక్షను సజావుగా నిర్వహించేందుకుగాను పరీక్ష నిర్వహించేబడే పరీక్షా కేంద్రానికి ఐదు వందల మీటర్ల పరిధిలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని. అలాగే పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ మూసి వేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు పోలీసు కమిషనర్ పలు సూచనలు చేసారు.