స్వతంత్ర, వెబ్ డెస్క్: ప. గో. జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న సత్యసాయి సేవ అన్న ప్రసాద కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో సకాలంలో సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్పందించి అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో రోగులు తాలూకా జనం ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.