స్వతంత్ర, వెబ్ డెస్క్: కంటెంట్ క్రియేటర్స్‌కి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. యూట్యూబ్‌లో లాగా ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనున్నట్లు ట్వీట్ చేశారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌గా ఉన్న వారికి తమ కంటెంట్ రిప్లై సెక్షన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు చెల్లించనున్నారు. ఈ చెల్లింపుల కోసం దాదాపుగా 5 మిలియన్ డాలర్లు(రూ. 41.2 కోట్లు)ను కేటాయించారు. దీంతో పాటుగా బ్లూటిక్ కలిగిన యూజర్లు తాము పోస్ట్ చేసిన ట్వీట్స్‌ను గంట వరకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. కాగా ఇటీవల అడ్వర్టైజింగ్ విభాగంలో అనుభవం కలిగిన లిండా యాకారినో ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.