స్వతంత్ర, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా ఖాజీపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు హోటళ్లు దగ్ధం అయ్యాయి. ఖాజీపేట జాతీయ రహదారి కొత్తూరు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజు పేలడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు పక్కనే ఉన్న హోటల్ లకు వ్యాపించడంతో రెండు హోటల్ లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన పై బాధితులు లబోదిబోమంటున్నారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు మొర పెట్టుకుంటున్నారు.


