స్వతంత్ర వెబ్ డెస్క్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా, కృతి సనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా చిత్రం.. ‘ఆది పురుష్’. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. జూన్ 16న ఈ చిత్రాన్ని చూడడానికి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేడుకనుద్దేశించి ప్రభాస్ మాట్లాడుతూ.. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు ఇచ్చిన నమ్మకమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకు వచ్చింది. మీరు ఇచ్చిన ఒక ధైర్యం మమ్మల్ని రాత్రి పగలు పోరాడి ఒక గొప్ప సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చేలా చేసింది. ఆదిపురుష్ అనే సినిమాలో మేము నటించాం అనడం కంటే ఒక గొప్ప కథలో మేము భాగం అయ్యాము అని అనడం కరెక్ట్. ఒకసారి చిరంజీవి గారు నన్ను అడిగారు. ఏంటి రామాయణం కథలో నటిస్తున్నావా? అని ప్రశ్నించారు. నేను అవును అని బదులిచ్చా. అప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. ఆ కథలో నటించడం ఒక అదృష్టం అంటూ చెప్పారు” అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని, కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తానని అన్నారు. కాగా ఈవెంట్‌లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ని ఫుల్ యాక్షన్ కట్‌తో రెడీ చేశారు. ‘వస్తున్నా రావణ’ అంటూ రాముడు రావణుడి పై యుద్ధం ప్రకటిస్తూ ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ సెకండ్ ట్రైలర్‌ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అక్కడే జరుగుతుండడంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు చెబుతున్నారు.
ఇక పెళ్ళెప్పుడు అని తన అభిమానులు అడిగిన ప్రశ్నకి ప్రభాస్ స్పందిస్తూ.. ‘ఇక్కడే తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రామాయణం చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని అంటారు. అలాంటి కష్టాలు మాకూ ఎదురయ్యాయి. నా 20ఏళ్ల కెరీర్‌లో ఓం రౌత్‌లాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పోరాటంగా ఈ సినిమాను పూర్తి చేశారు. సినిమా ఫంక్షన్‌లకు హాజరుకాని చినజీయర్ స్వామివారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులే నా బలం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమా పూర్తి చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. మామూలుగా వేదికలపై నేను మాట్లాడే దానికంటే ఈసారి ఎక్కువ మాట్లాడా. ఇకపై అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తా. కుదిరితే మూడు కూడా రావచ్చు. వేదికలపై తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని ప్రభాస్ అన్నారు.


