29.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

నువ్వు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా.. ‘బీజేపీ – కేసీఆర్’ దోస్తానా ఇదే!

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై అనుక్షణం ప్రశ్నలు సంధించే వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల.. మరోసారి ట్విట్టర్ వేదికగా నిప్పుల వర్షం కురిపించారు. “WASHING POWDER NIRMA” కేసీఆర్ కు సైతం పనిచేసినట్టు ఉంది. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది. బీజేపీతో దోస్తీ బయటపడింది. కారు – కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ మొఖంలో కనపడ్డది. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదు… అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు.

బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండు. అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే BJP, BRS రహస్య అజెండా.. అంటూ తనదైన శైలి మండిపడ్డారు.

నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇన్నాళ్లు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదే. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? పోస్ట్ పోల్ ఒప్పందమా..? కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్ దొర.. అసలు విషయం బయటపెట్టు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంటా? కేసీఅర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా ? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? తక్షణం బీజేపీ నోరు విప్పాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

 

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్