స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసులను క్షేమంగా తీసుకొచ్చేందుకు జగన్ సర్కారు పనులను వేగవంతం చేసింది. ఏపీ నుంచి ప్రమాదానికి గురైన రెండు రైళ్లల్లో తెలుగు ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించారు. ఈ సందర్బంగా మంత్రి మంత్రి బొత్స మాట్లాడుతూ.. రైలు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నామని హామీ ఇచ్చారు. రైలుప్రమాద ఘటనలో మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించామని అన్నారు. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతి చెందారని తెలిపారు. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం ఉంటున్నట్లు వివరించారు. గురుమూర్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. కాగా, ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపుగా 290 మంది మృతి చెందగా.. 800 మంది వరకు గాయాల పాలయ్యారు. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


