స్వతంత్ర, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద ఓ గ్రావల్ లారీ లారీ బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపు వెళుతున్న లారీ తొలుత ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ నాగేంద్రతో పాటూ గుడిలో నిద్రిస్తున్న స్థానికుడు సోము లక్ష్మణరావు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు శేఖర్, నాగేంద్రలను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.