స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే కమాండ్ కంట్రోల్ చాలా పెద్దదని కొనియాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కమాండ్ కంట్రోల్ తో డ్రగ్స్ కు పోలీసులు ఫుల్ స్టాప్ పెడుతున్నారని అన్నారు. సైబర్ క్రైమ్ రేటు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. డ్రగ్స్ ఎక్కువగా విమానాల నుంచి సరఫరా అవుతున్నాయని.. దీనికి అరికట్టేందుకే కమాండ్ కంట్రోల్ ని విస్తరించమని అన్నారు. గుండె ఎంతో ముఖ్యమో.. పోలీస్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్న మంత్రి.. యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. నగరంలో క్రైం లేదంటనే… పరిశ్రమలు,పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు.