స్వతంత్ర, వెబ్ డెస్క్: స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జగన్.. వైఎస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపటి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు, రైతులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. అయితే ఇటీవలే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో టీడీపీ అదినేత చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు.ఇక ఈ సభలో సీఎం జగన్ మినీ మేనిఫెస్టో పై స్పందించే అవకాశం ఉంది.