స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ సీనియర్లకు కేంద్ర అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఎంపీలతో సహా సీనియర్లు అందరూ అసెంబ్లీ బరిలో నిలవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటి ఇవ్వాలంటే సీనియర్లు పోటి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు సీనియర్లు విముఖత చాటుతున్నారు. మోడి హవాలో ఎంపీలుగా ఈజీగా గెలవచ్చనుకుంటున్నారు. అధిష్టానం ఝలక్ తో ముందే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సీనియర్లు, ఎంపీలు ఓడిపోతామన్న భయంలో అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే పార్లమెంటు ఎన్నికల్లో చాన్స్ కోల్పోతామన్న భయంలో ఉన్నారు. ఒకేవేళ ఓడిపోయి ఎంపీగా పోటి చేసినా ప్రజలు నమ్మె పరిస్థితి ఉండదన్న అంచనాలో సీనియర్లు ఉన్నారు. అయితే సీనియర్లు మాత్రం ఎంపీగా పోటి చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ సత్తాను నిరూపించుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పొటి చేయాల్సిందేనని అధిష్టానం సంకేతాలు పంపడంతో అధిష్టానం ఆదేశాలకు నో చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నారు నేతలు. ఎంపీగా గెలుద్దాం అనుకుంటే ఇరకాటంలో పడ్డామే అనే సందిగ్ధంలో ఉన్నారు బీజేపీ సీనియర్లు, ఎంపీలు.
బీజేపీ సీనియర్లు అంబర్ పేట్ నుండి కిషన్ రెడ్డి,ముషీరాబాద్ నుండి డా. లక్ష్మన్, కరీంనగర్ or వేములవాడ నుండి బండి సంజయ్, ఆదిలాబాద్ నుండి సోయాం బాబు రావు, ఆర్ముర్ నుండి దర్మపురి అరవింద్, గద్వాల నుండి డికే అరుణ, రాజేంద్రనగర్ నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ నుండి జితేందర్ రెడ్డి, చెన్నూరు నుండి వివేక్ వెంకట్ స్వామి, ఆలేరు నుండి బుర్ర నర్సుయ్య గౌడ్, స్టేషన్ ఘన్ పూర్ నుండి డా. విజయ రామారావు పోటీ చేయనున్నారు.