స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రుపునారాయణపేట మానేరు ఒడ్డున ఇన్నోవా కారు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధం అయింది. వీకెండ్ కావడంతో మానేరు ప్రాంతానికి సరదాగా గడపడానికి కొందరు యువకులు కారులో వచ్చారు. రైతులు పొలాలలో గడ్డికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగడంతో.. కారుకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఇన్నోవా కారు మంటల్లో పూర్తిగా దగ్ధమై కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.