స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్న సమయంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. లేఖలో ఆయన పలు విషయాలు ప్రస్తావిస్తూ.. పలు మీడియా సంస్థల ప్రతినిధులను అవినాశ్ అనుచరులు లాక్కెళ్లి కొట్టడం దుర్మార్గమన్నారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టు సంఘాల నేతలు అడిషనల్ ఎస్సీని కలిసి పరిస్థితిని వివరించినా కూడా ఇప్పటి వరకు దుండగులను పట్టుకోలేదన్నారు.