స్వతంత్ర వెబ్ డెస్క్: మిర్యాలగూడలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిల చేతుల మీదుగా ఏరియా హాస్పిటల్ లో 200 పడక గదుల బిల్డింగ్ కి శంకుస్థాపనతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బస్తి దావఖాన, 28 పిహెచ్సీ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేశారని అన్నారు. కేసీఆర్ అద్భుత పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు దక్కాయని అన్నారు.
కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారాలను అభివృద్ధి చూపించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఐదు ఏళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇప్పించామన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఢిల్లీ అవార్డులు ఇస్తుందా? అంటూ ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సాగునీటి కరువు, దొంగ కరెంట్ కాంగ్రెస్ చలవే అంటూ ఎద్దేవా చేశారు. మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.