స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని కానీ.. వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. శుక్రవారం ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ… ఈ ఏడాదిలో మార్గదర్శి కేసును ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. రామోజీరావు తప్పు చేశారని నిర్ధారణ చేసుకున్నాకే… అధికారులు ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో ఏ చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలు పాటించడం లేదని మండిపడ్డారు. నిబంధనలు పాటించని కంపెనీలను ఏం చేయాలన్న దానిపై ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.